Showing posts with label satyanarayana swami. Show all posts
Showing posts with label satyanarayana swami. Show all posts

Monday, 31 December 2018

satyanaaraayaNa swaami mangaLahaarati

సత్యనారాయణ స్వామి మంగళహారతి




శ్రీసత్యనారాయణుని పూజకు రారే
కనులారా స్వామిని చూసి హారతులివ్వరే      "శ్రీసత్య"

ఏ ఇంట స్వామివ్రతం తప్పక జరుగునో
ఆ ఇంట శ్రీలక్ష్మి స్థిరముగా ఉండును     
సకలైశ్వర్యములు  సకలసంపదలు
వారికి కలుగును భోగభాగ్యములు            "శ్రీసత్య"

విభవములు తొలగించు విష్ణుదేవున్ని
భక్తితో ధ్యానించి పూజించునంతనే
సత్యదేవుని కృపకు
పాత్రులు అగుదురు                    " శ్రీసత్య"