జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరును నేను
సల సల నువ్వు తాకితే నన్ను
పొంగేవరదై పోతాను
చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటాన్నవుతాను
హే మన జంటవైపు
జాబిలమ్మ తొంగిచూసెనే
హే ఇటు చూడకంటూ
మబ్బురెమ్మ దాన్ని మూసెనే
యే నీటిచెమ్మ తీర్చలేని
దాహమేసెనే ||జల జల||
సముద్రమంత ప్రేమ
ముత్యమంత మనసు
ఎలాగ దాగి ఉంటుంది లోపల
ఆకాశమంత ప్రణయం
చుక్కలాంటి హృదయం
ఎలాగ బయటపడుతుంది ఈవేళ
నడిఎడారిలాంటి ప్రాణం
తడిమేఘానితో ప్రయాణం
ఇక నీనుంచి నన్ను
నా నుంచి నిన్ను
తెంచలేదు లోకం. ||జల జల||
ఇలాంటి తీపిరోజు
రాదు రాదు రోజు
ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం
ఇలాంటి వానజల్లు
తడపదంట ఒళ్ళు
ఎలాగ దీన్ని
గుండెల్లో దాచడం
ఎపుడూ లేనిదీ ఏకాంతం
ఎక్కడా లేనీ యేదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు
నీలోన నేను
మనకు మనమె సొంతం. ||జల జల||
No comments:
Post a Comment