నేను పల్లెటూర్లో పుట్టి, పెరిగాను. కానీ చిన్నప్పటి నుండి చదువు కొరకు 5వ తరగతి నుండి ఇప్పటి వరకు ఊరికి దురంగా చదువుకున్నాను, ఉద్యోగం చేసాను, పెళ్ళి అయ్యాక కూడ వేరే దేశానికి వెళ్ళాను, ఎన్నో మండలాలు, దేశాలు, ఊర్లు తిరిగాను. కాని పల్లెటూర్లో ఉన్న సంతోషం , ప్రేమ ఎక్కడా దొరకలేదు. ప్రత్యేకంగా ఈసారి మొదటిసారి 15 నెలలు మా అమ్మ నాన్నలకి, కుటుంబానికి, ఊరికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈసారైతే స్వీడన్ లో +1, +2 degrees ఉంటే సతోషపడే వాతావరణం నుండి +48 లెద +49 degrees ఉండే ఇండియాకి వచ్చాను. కానీ ఏనాడు ఇబ్బంది పడలేదు. అయ్యో స్వీడన్ కి తిరిగి వెళ్దాం అనిపించింది లేదు . మాతో పాటు పిల్లలకు కూడ అనిపించలేదు . అదీ మనం పుట్టిన ఊరి, దేశ మహిమ.
పల్లెటూర్లో మనం మంచితనంగా ఒకే ప్రదేశంలో ఓక పది సంవత్సరాలు ఉంటే చలు, ఎన్నొ సంబంధాలు, ఎన్నొ బాందవ్యాలు ఎర్పడుతాయ్. అందరూ వరుసతో పిలుస్తారు. మామ, అత్త, పిన్ని, బాబాయ్, తాత, బామ్మ ఇల ఎన్నొ ఎన్నెన్నో. ఎ కష్తం వచ్చినా సహాయం చేస్తారు. ఎ సతోషం వచ్చిన అందరు పంచుకుంటారు.
నాకు ఎప్పుడు జరిగే ఒక అనుభవం: నన్ను అందరూ ఊర్లో "బుజ్జవ్వ" అని పిలుస్తారు. మాకు కిరాణం దుకాణం ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి బుజ్జవ్వా...బాగున్నవా, బుజ్జవ్వా...బాగున్నవా, అంటారు. చల్లంగా ఉండు అవ్వా అంటారు.
అందరి ఆశీర్వాదాలతోనే నేను ఇంత సంతోషంగా ఉన్నా అనుకుంటా. కొందరైతే వచ్చిన ప్రతీసారి "చిన్నప్పుడు పలక, బలపం పట్టుకుని, ముక్కు చీమిడి కార్చుకుంటూ స్కూల్ కి వెళ్ళేదానివి, ఇప్పుడెంత పెద్ద పెరిగావు అంటారు. ప్రతీసారి ఇలాగే అంటారు. నాకు పిల్లలు పుట్టి పెద్ద పెరుగుతున్నారు కాని వాళ్ళు అలానే అంటారు. అయునా తెలియని సంతోషం, ఏదో బలం అనిపిస్తుంది. మనం ఎవరినైనా వరుసపెట్టి హక్కుతో పిలిచి ప్రేమను పంచవచ్చు, తీసుకోవచ్చు. ఇంటి చాకలమ్మ, పాలు పోసే అబ్బాయు నుండి ప్రతి ఒక్కరినీ మనం రెండు వంతులు ప్రేమిస్తే వాళ్ళు మనల్ని పది వంతులు ప్రేమిస్తారు.
అన్నింటీకి తోడు ప్రొద్దున లేవగానే అందరు అలుకు చల్లి ముగ్గులు వేస్తారు. ప్రతీరోజు కోళ్ళు కూస్తాయు. వర్షాకాలంలో కోయులలు ఎంతో బాగ పాడుతాయు. పచ్చని పొలాలు, అందమైన సూర్యోదయం, సూర్యాస్తమయం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయు. మా పిల్లలైతే కోళ్ళను, బర్రెలను, కుక్కలను, ఆవులను ఇండ్లల్లో తిరుగుతుంటే చూసి ఎంతో సంతోషపడుతుంటారు. ఇదంతా ఎంతో ఆకర్షణీయమైనది.
ఇక పండ్లు, కూరగాయలు ఎంతో స్వచ్చమైనది, తాజా అయునవి దొరుకుతాయు. మనం సిటీలో, సూపర్ మార్కెట్లలో లైన్లు కట్టి మరీ ఎన్నో డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటాం అయునా కూడ మనకి తాజావి దొరకవు.
మనం సిటిలో నైతే పిల్లలు ఆడుకోవాలంటే మనకున్న చిన్న బాల్కనీలో ఆడుకోవాలి లేదంటే వారాంతంలో ప్లాన్ చేసుకుని పిల్లలను పార్క్ కి గాని, వేరే ప్రదేశాలకి గాని తీసుకెళ్ళాలి. పల్లెటూర్లోనైతే ప్రతి ఇంటి ముందు దాదాపుగా ప్లేస్ ఉంటుంది, పక్కింటి పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనంతసేపు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. మనుమరాళ్ళు, మనుమళ్ళతో అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, తాతయ్యలు చిన్న పిల్లలగా కలిసిపోయు వాళ్ళకు వీలయునప్పుడల్లా ఆడుతూ ఉంటారు, ఇది ఎంతో సంతోషదాయకమైన విషయం పిల్లలకు మరియు పెద్దలకు.
పట్టణ్ణాల్లో రోజు చేసే సాదారణ పూజ చేయాలన్న మినిమం 200 రూపాయల నుండి 300 రూపాయలు ఖర్చు చేస్తే కాని మనకు తాజా పూలు దొరకవు కాని పల్లెటూర్లో ఇంటి ముందర నాలుగు పూలమొక్కలు పెట్టుకుంటే తాజా మరియు రకరకాల పూల చెట్ల నుంది
నేరుగా తెంపుకుని పూజలో వాడుకోవచ్చు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో అనుభవాలు, ఎన్నో సంతోషాలు...
ఎప్పటికైనా పల్లెటూర్లో స్థిరపడాలి అనాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.